ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడిపందాల నిర్వహణకు తెర వెనుక భారీ మామూళ్లు సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో బరికి సుమారు రూ.20 లక్షల వరకు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారుల వరకు చేతులు మారుతున్నట్లు ప్రచారం ఉండగా, ఎమ్మెల్యేల అనుచరులే వ్యవహారాలు చక్కబెడుతున్నారన్న సమాచారం ఉంది.