ఏలూరు నగరంలోని చోది మెళ్ళ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి తౌడు లోడుతో వెళ్తున్న లారీలో వంటకు వినియోగించే గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. క్షణాల్లో చూస్తుండగానే లారీ తగలబడిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.