NTR: జగ్గయ్యపేట ఎమ్మెల్యే తాతయ్య మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబును కలిశారు. జగ్గయ్యపేట-మాదిపాడు వంతెనకు ‘ముక్త్యాల రాజా’ పేరు పెట్టాలని ఈ సందర్భంగా ఆయన సీఎంకు వినతి పత్రం అందజేశారు. స్వాతంత్ర సమరయోధుడిగా ముక్త్యాల రాజా దేశానికి చేసిన సేవలను ఆయన వినతిపత్రంలో వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.