SS: నల్లచెరువులోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మాట్లాడి భోజన వసతులు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. వంట గదులు, పరిసరాలను పరిశీలించి అపరిశుభ్రతపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనశాల, వంట గదులను వెంటనే ఆధునీకరించాలని ఆదేశించారు.