కృష్ణా: గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులుల సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన రైతు పందుల నుంచి తన పంట పొలాన్ని రక్షించేందుకు ఉచ్చు పెట్టగా ఉచ్చులో చిరుత పులి చిక్కింది. రైతు ఉదయాన్నే పొలం వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి చిరుత పులి మృతి చెందింది. దీంతో గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు.