CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలకగా, ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి వారిని దర్శించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వేదపండితులు వీరికి వేదాశీర్వచనం అందించారు.