ELR: అనారోగ్యం కారణంగా అకాల మరణం చెందిన పోలీస్ సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడంలో పోలీస్ శాఖ ముందుంటుందని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ అన్నారు. బుధవారం వివిధ కారణాలతో మృతి చెందిన ఇద్దరు పోలీస్ ఉద్యోగుల కుమారులకు కారుణ్య నియామక పత్రాలను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా వారికి దిశ నిర్దేశం చేశారు.