PPM: దత్తత తీసుకున్న పిల్లలను తమ సంతానంతటిలా ప్రేమించి, వారికో ఉజ్వల భవిష్యత్తును అందించాలని కలెక్టర్ డా.ప్రభాకర్ రెడ్డి తల్లితండ్రులను కోరారు. సోమవారం జిల్లా ప్రత్యేక దత్తత విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన కార్యక్రమంలో, ఒక అడపాపను దత్తతకు ఇచ్చే ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పూర్తి చేశారు. అనంతరం వారిని అభినందించారు.