నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రకాశం కొండపి ప్రభుత్వ కళాశాలకు చెందిన కుంచాల ప్రవళిక 978 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచింది. కాగా, ప్రవళికది పంచాయతీ పరిధిలోని కట్టవారిపాలెం గ్రామం. ప్రవళిక తండ్రి రోజు కూలీపనికి వెళుతుండగా, తల్లి టైలరింగ్ చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రవళకను ప్రిన్సిపాల్ ఎం. వెంకటేశ్వర్లు అభినందించారు.