ప్రకాశం: ఒంగోలు మండలంలోని చింతాయగారిపాలెం గ్రామ సచివాలయ భవనం నిర్మాణ ఖర్చులు దుర్వినియోగం చేశారని సర్పంచ్‌పై వచ్చిన ఆరోపణలపై డీఎల్డివో సువర్తమ్మ, ఏపివో నాగేశ్వరరావు బృందం గ్రామానికి విచారణకు వచ్చారు. భవనానికి సంబంధించిన ఆర్థిక రికార్డులు, బిల్లులు, పనుల వివరాలు పరిశీలించారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించి నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు.