కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం 110 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సోలార్ సిస్టం,పేటీఎం,ఎస్బీఐ సంస్థలలో పనిచేసేందుకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న టెన్త్ నుంచి డిగ్రీ చదివినవారు ఆ రోజున ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.