TG: రాష్ట్రంలో ACB వలకు మరో అధికారి చిక్కాడు. ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ SE రామారావు రూ.1.9 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. యాదగిరిగుట్ట ఆలయంలో టెండర్ ద్వారా లడ్డూ తయారీ మిషనరీ సప్లై చేసినందుకు ఆయన 20% కమిషన్ డిమాండ్ చేయడమే కాక బిల్లులు నిలిపేశాడని ఓ కాంట్రాక్టర్ ACBని ఆశ్రయించాడు. ఆపై రామారావుని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.