VKB: బొంరాస్ పేట మండల వ్యాప్తంగా వరి రైతులను మొంథా తుఫాను ముంచెత్తింది. ఆరు గాలము కష్టపడి సాగుచేసిన వరి పంట అకాల వర్షం, గాలివాన బీభత్సానికి చేతికొచ్చిన పంట నేలకొరగడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.