KRNL: బుధవారం అగ్నిప్రమాదం జరిగిన ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులోని గోనె సంచుల దుకాణాన్ని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గురువారం సందర్శించారు. మార్కెట్ యార్డు ఛైర్మన్ మల్లయ్య, ఇతర ప్రతినిధులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.