PPM: పార్వతీపురం పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద గల ఈవీఎం గోదామును కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తనిఖీ చేశారు. ఈ మేరకు నెల వారీ తనిఖీల్లో భాగంగా గురువారం ఆయన గోదాములను సందర్శించి అక్కడి పరిస్థితిని గమనించారు. కాగా, గోదాములకు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భధ్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.