టాలీవుడ్ నటుడు నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న సినిమా ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నవంబర్ 21న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రొమాంటిక్ థ్రిల్లర్ జానర్లో రాబోతున్న ఈ సినిమాలో రవితేజ మహాదాస్యం, శివాజి రాజా. ప్రజ్ఞా నయన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.