HYD: చెక్ బౌన్స్ కేసులో 6 నెలల జైలు, రూ.5 లక్షలు చెల్లించాలని నాంపల్లిలోని 9వ అదనపు కోర్టు తీర్పు ఇచ్చినట్లు బాధిత వ్యాపారి సుందరయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 2022లో హిమాయత్ నగర్‌కు చెందిన ఓ బిల్డర్ రూ.6.50 లక్షల సామాగ్రి కొనుగోలు చేసి రూ.2 లక్షలు చెల్లించి, మిగతా సొమ్ముకు చెక్కులు ఇచ్చారని, చెక్ బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించగా శిక్ష విధించిందన్నారు.