SRD: పటాన్ చెరు పట్టణం, మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో జాతీయ స్వచ్ఛ హరిత రేటింగ్ తనిఖీలను గురువారం నిర్వహించారు. సీనియర్ ప్రధానోపాధ్యాయులు భాస్కర్ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉన్న వసతులపై ఆన్ లైన్ లో నమోదు చేస్తామని ఆయన తెలిపారు. దీని ఆధారంగా పాఠశాలలకు హరిత రేటింగ్ వస్తుందని చెప్పారు.