KRNL: రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను గురువారం కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి పి.నాగరాజు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.