కోనసీమ: ఉప్పలగుప్తం మండలం చినగాడవిల్లిలో విద్యుత్తు పనుల నిమిత్తం గురువారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనుందని ఈఈ కె. రాంబాబు తెలి పారు. చినగాడవిల్లి, పెదగాడవిల్లి, మునిపల్లి గ్రామాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా ఉండదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు