PPM: జిల్లాలో పంచాయతీల కంటే రెండింతలు హేబిటేషన్లు ఉన్నాయని, అందువలన 3వ రోజు కూడా పింఛన్లను పంపిణీ చేసేందుకు అవకాశం కల్పించాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్ది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ను కోరారు. గురువారం జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శత శాతం పంపిణీ చేశామన్నారు.