ELR: ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు బిఎల్వోలకు ఓటర్ లిస్టుపై శిక్షణ తరగతులు జరుగుతాయని తాహసిల్దార్ వై.పూర్ణచంద్ర ప్రసాద్ తెలిపారు. ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ బిఎల్వోలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. మండలంలోని బిఎల్వోలు తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరు కావాలని తాహసిల్దార్ కోరారు.