KKD: యుద్ధం కారణంగా గ్యాస్ నిల్వలు తగ్గి ధరలు పెరుగుతాయనే అసత్య ప్రచారాలను నమ్మవద్దని కాకినాడ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో పౌరసరఫరాలు, గ్యాస్ డీలర్లతో ఆయన సమావేశమయ్యారు. వినియోగదారులకు సరిపడా LPG నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. గ్యాస్ గురించి ఎవరు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.