E.G: 18 నెలల వయసులోనే యోగాసనాల్లో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి రాజా సుచిత్ర శ్రీ అనన్యను మంత్రి కందుల దుర్గేశ్ అభినందించారు. సూర్య నమస్కారాలతో పాటు వివిధ రకాల యోగాసనాలు చేసి ప్రపంచ రికార్డు సాధించినట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు నిడదవోలులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో చిన్నారి కుటుంబసభ్యులు మంగళవారం మంత్రిని కలిశారు.