AKP: ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధం అవుతున్న రైతులకు గురువారం ఎలినినోపై ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరులో అవగాహన సమావేశం నిర్వహించారు. ఎలినినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో పాటు వాతావరణం వేడెక్కే అవకాశాలు ఉన్నాయని ఏవో సౌజన్య తెలిపారు. అలాగే, విత్తన గుళికలు తయారీ గురించి సిబ్బందికి వివరించారు.