ప్రకాశం: సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ సైనిక్ స్కూల్లో ఇటీవల మరణించిన విద్యార్థి తౌశిక్ కుటుంబ సభ్యులను మంగళవారం కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.