కృష్ణా: స్వచ్ఛతా హీ సేవా ‘ఏక్ దిన్,ఏక్ గంటా,ఏక్ నాథ్’ కార్యక్రమం గురువారం నిర్వహించారు. సచివాలయ,మండల పరిషత్ సిబ్బందితో కలిసి డివిజన్ పంచాయతీ అధికారి సంపత్ కుమార్ గుడ్లవల్లేరులో మొక్కలను నాటారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహమ్మద్ ఇమ్రాన్, డిప్యూటీ ఎంపీడీవో అంజనా దేవి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.