NLR: చేజర్ల మండలం ఆదురుపల్లిలో మిలాద్ ఉన్ నబి పండుగను ఘనంగా నిర్వహించారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిగి, మౌలానా మహబూబ్ బాషా ప్రవక్త ముహమ్మద్ జననం, వారి బోధనల ప్రాముఖ్యతను వివరించారు. ఆయన మార్గం శాంతి, క్షమాభిక్ష, మానవత్వాన్ని నేర్పుతుందని తెలిపారు. సమాజంలో సహనం, సదాచారం, మానవ విలువలను పాటించాలని పిలుపునిచ్చారు.