W.G: అభాగ్యులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇటీవల చంద్రబాబును తణుకు పర్యటనలో కలిసి తన గోడు వెళ్లబోసుకున్న మహిళకు ఇంటి స్థలం పట్టాను మంగళవారం ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాట ఇచ్చిన ఐదు రోజుల్లోనే బాధితురాలిని గుర్తించి సీఎం సహాయ నిధిగా రూ.లక్ష చెక్కును కలెక్టర్ అందజేశారన్నారు.