ELR: ఈనెల 13, 14 తేదీల్లో జంగారెడ్డిగూడెంలో PDSU జిల్లా విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులు, జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ. భూషణం తెలిపారు. విద్యావ్యవస్థ సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, విద్యార్థులను చైతన్యవంతం చేసేందుకు ఈ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. నాని, అనిల్, అచ్చిరెడ్డి, దానియేలు, కన్నయ్య పాల్గొన్నారు.