VZM: రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని SP దామోదర్ అధికారులను ఇవాళ ఒక ప్రకటనలో ఆదేశించారు. గడిచిన 20 రోజుల్లో డ్రంక్ & డ్రైవ్ కేసుల్లో 45 మందికి జైలు శిక్ష పడిందని, హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారిపై 19,077 కేసులు, మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై 5,510 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై 17,246 కేసులు నమోదు చేశామన్నారు.