PPM: గరుగుబిల్లి మండలం తోటపల్లి ఆయకట్టు రైతులు నీటి పారుదల శాఖ అధికారులు, మిల్లర్ల వలన నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆదివారం విమర్శించారు. ధాన్యానికి మద్దతు ధర కోసం రైతులు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. రైతుల హక్కుల కోసం రైతు సంఘం పోరాటానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.