ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జనసంద్రంగా మారింది.ఆదివారం సెలవు రోజు కావడంతో సమ్మక్క,సారలమ్మల దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు భారీగా తరలివచ్చారు.జంపన్న వాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు.ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండగా పిల్లర్లపై చెక్కిన గిరిజన ఆచార,వ్యవహారాలకు సంబంధించిన చిత్రాలను తమ సెల్ ఫోన్లలో బంధిస్తూ సందడి చేశారు.