W.G: 2030 నాటికి HIV రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తునట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో HIV బాధితులకు చేయూత కార్యక్రమంలో ఇవాళ మంత్రి పాల్గొన్నారు. HIV బాధితులకు పౌష్టికాహారం, నిత్యవసర సరుకుల బ్యాగులను మంత్రి పంపిణీ చేసారు. సమాజంలో HIV బాధితుల పట్ల మానవత్వం, ప్రేమానురాగాలతో మెలగాలని అన్నారు.