MBNR: మహబూబ్ నగర్లో తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో ‘ఛలో భీమాకోరేగావ్’ ఆదివారం కరపత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు డా. మంత్రి నర్సింహయ్య ఆవిష్కరించారు. భీమా కోరేగావ్ యుద్ధం దళితుల శౌర్యానికి ప్రతీక అని, జనవరి 1న శౌర్య దివస్ నిర్వహించడం ఆనవాయితీ అని ఆయన తెలిపారు. 2026లో పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.