WNP: పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో వెలసిన రామలింగేశ్వర స్వామి ఆలయంలో మార్గశిర అర్థ నక్షత్రం సందర్భంగా ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి శివలింగానికి పాలాభిషేకం, లింగాష్టకం, బిల్వాష్టకం, అష్టోత్తరం వంటి పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.