AP: 13 ఏళ్లు దాటిన వాహనాలకు టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజులను పెంచుతూ కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ను నిలిపి వేయాలని ఏపీ లారీ ఓనర్ల సంఘం డిమాండ్ చేసింది. లేదంటే ఈనెల 9 నుంచి రైల్వే షెడ్లు, షిప్ యార్డుల్లో గూడ్స్ రవాణా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. పెంచిన ఫీజుల వల్ల పెనుభారం పడుతుందని తెలిపింది. ఫీజులు తగ్గించేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.