SRD: సిర్గాపూర్ మండలం పోచపూర్ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ నేడు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 20 రోజుల నుంచి లీవ్‌లో ఉన్నారు. జాండీస్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నేడు మధ్యాహ్నం మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు. ఈయన మృతికి MPDO శారద, పంచాయతీ కార్యదర్శులు సంతాపం తెలిపారు.