TPT: అమెరికాకు చెందిన NRI భక్తుడు శివ ప్రసాద్ ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. 10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులకు విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సదాశివరావు కూడా ఉన్నారు. అనంతరం దాతకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.