HYD: తార్నాక నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గంలో కవాడిగూడ జంక్షన్ వద్ద రోడ్డు పరిస్థితి అద్వానంగా మారింది. అనేక చోట్ల గుంతలు ఏర్పడి ఉండటం, బిటమిన్ లైనింగ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.