TPT: తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇద్దరు అ.ఫ్రొఫెసర్లు విద్యార్థినిని లైగింకంగా వేధించారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనను MP గురుమూర్తి నేషనల్ కమిషన్ల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ మహిళా కమిషన్‌కి లేఖలు రాశారు. ఈ మేరకు బాధిత యువతికి న్యాయం చేయాలని ఆయన కోరారు.