JGL: విద్యార్థులు చారిత్రక కట్టడాల ప్రాధాన్యతను తెలుసుకోవాలని తెలుగు పండితుడు కామని లక్ష్మయ్య అన్నారు. రాయికల్ పట్టణంలోని త్రికూటాలయాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సందర్శించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి పనుల గురించి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు రాం నరేశ్, చెరుకు మహేశ్వర శర్మ పాల్గొన్నారు.