MDCL: రామంతపూర్ చెరువు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. చెరువు శుద్ధికరణతో పాటుగా, సుందరీకరణ పనులు సైతం చేపట్టాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు. రామంతపూర్ చెరువును ఒక మినీ ట్యాంక్ బండ్ మాదిరిగా రూపుదిద్దాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.