VZM: జామి ఎల్లారమ్మ తీర్ధ యాత్రి నేపథ్యంలో ఈనెల 24 నుంచి 8 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఎస్.కోట RTC DM కే.సుదర్శనరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ బస్సులను సాధారణ పల్లె వెలుగు ఛార్జీలతో నడపనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సులను కొత్తవలస-జామి, జామి-కొత్తవలసకు ఉదయం 5:30 గంటలు నుంచి నడపనున్నట్లు పేర్కొన్నారు.