AKP: ఎలమంచిలి జడ్పీ అతిథి గృహంలో బుధవారం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు 300 అర్జీలను ఎమ్మెల్యేకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. సమస్యలు పరిష్కారం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.