VZM: బొబ్బిలి బైపాస్ రోడ్డులోని శ్రీదాడితల్లి ఆలయంలో శుక్రవారం ఘనంగా సహస్త్ర ఘట్టాభిషేకం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మణి కుమార్ శర్మ మాట్లాడుతూ.. గొల్లపల్లి దాడితల్లి గ్రామదేవత పండుగ ఈనెల 26, 27, 28న జరగనుండడంతో ఇవాళ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసామన్నారు. ఈ పూజలకు బొబ్బిలి, గొల్లపల్లి, పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.