TPT: శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. నారాయణమ్మ మాట్లాడుతూ.. ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దడం గురువుల బాధ్యతన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చి గురువుల గొప్పతనాన్ని ఈ లోకానికి చాటి చెప్పిన విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణ అని కొనియాడారు.