KDP: మైదుకూరు శ్రీనిధి భవనంలో మెప్మా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల వ్యాపార అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ నిధి’ పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హాజరై, మొత్తం 772 మంది లబ్ధిదారులకు రూ.2,00,15,000 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.