NLR: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించనున్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.