BPT: మత్యకారులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందీ లేకుండా బోట్లు వేట చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల మండలం అడవిపల్లి పాలెంలో మంగళవారం సముద్రం, కాలువ కలిసే ప్రదేశాన్ని ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నుండి అధిక నిధులు తెచ్చి మత్యకారుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.